Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. తెలుగు జవాన్ వీరమరణం..
- భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం..
- జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు విడిచిన ఏపీకి చెందిన మురళీ నాయక్..
- సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా.. రేపు కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది.. గోరంట్ల మండలం కళ్లితాండ గ్రామానికి చెందిన జ్యోతిబాయి, శ్రీరాముల నాయక్‌కు ఏకైక సంతానం మురళీ నాయక్.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ విద్యా వ్యాసం చేసిన ఆయన.. 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.. నాసిక్‌లో ట్రైనింగ్ పొంది, జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు.. పంజాబ్‌లో పనిచేస్తుండగా.. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు.. కానీ, పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు.. ఇక, వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు.. వీరజవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..
Read Also: Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
మురళీ నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం.. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు నారా లోకేష్..
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్‌ను నిండా ముంచిన డ్రాగన్..!
ఇక, జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మురళీనాయక్ స్వస్ధలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్లి తండా.. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్న జగన్.. మురళీనాయక్ కుటంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.. పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు మురళీనాయక్ మృతికి సంతాపం ప్రకటించారు..
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!