BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హాట్ కామెంట్లు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న రాఘవులు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర విభజనకు 12 సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమని రాఘవులు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోవైపు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ఇక, వైఎస్ జగన్‌పై నేరుగా విమర్శలు చేస్తూ, ఆయనకు రాజకీయంగా మెచ్యూరిటీ లేదని రాఘవులు అన్నారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ మాట్లాడిన ఆయన, ఇప్పుడు ఆ అంశాన్ని వదిలేసి ఇతర విషయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని ఏర్పడే సమయంలో అందరూ ఆనందించి, సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మెచ్యూరిటీ లేకుండా మాట్లాడటం రాజకీయ నాయకులకు తగదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!