భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మంత్రి సవిత అందించారు. మురళీ తల్లిదండ్రులకు రూ.50 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వం తరఫున అందజేశారు. అంతకుముందు మురళీ నాయక్ చిత్రపటానికి మంత్రి సవిత నివాళి అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకి చెక్కును అందించిన అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం…
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది..