Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Cleaning Tips: వంటగదిలో గిన్నెలు తోమడం ఎంత పనైతే, ఆ జిడ్డును వదిలించడం అంతకంటే పెద్ద తలనొప్పి. ముఖ్యంగా స్టవ్ చుట్టూ ఉన్న టైల్స్, క్యాబినెట్లు, చివరికి లైట్ల మీద కూడా జిడ్డు ఎగసి పడుతుంది. ఓపెన్ కిచెన్ అయితే ఆ పొగ, జిడ్డు హాలు వరకు వెళ్తాయి. అందుకే, జిడ్డు పేరుకుపోయాక గంటల తరబడి రుద్దడం కంటే, ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు ఈ జిడ్డుపై తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలను చూద్దాం. వంట చేసేటప్పుడు క్యాబినెట్లు, ఫ్రిజ్ మీద పడే జిడ్డు, దుమ్మును క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. దీన్ని తప్పుకోవడానికి ఆ ఫ్లాట్ సర్ఫేస్‌ల మీద వాక్స్ పేపర్, పార్చ్మెంట్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ లేదా కిచెన్ షెల్ఫ్ లైనర్లను పరవండి. జిడ్డు పట్టిన తర్వాత వాటిని తీసి పడేసి కొత్తవి పెట్టుకోవచ్చు. లేదంటే లైనర్ను తుడిచి మళ్లీ వాడొచ్చు. అలాగే స్టవ్ దగ్గర కౌంటర్ మీద ఉండే వస్తువులు జిడ్డు కాకుండా ఉండాలంటే, వంట చేసేటప్పుడు వాటి మీద ఒక టవల్ కప్పండి. రోజూ గరిటెల స్టాండ్ కడిగే బదులు టవల్ ఉతికేసుకోవడం ఈజీ. వంటగదిలో పొగను పోగొట్టడానికే కాదు, గాలిలో ఉండే జిడ్డు కణాలను పీల్చుకోవడానికి కూడా వెంట్ హుడ్ చాలా ముఖ్యం. చాలా మోడళ్లలో డిష్వాషర్లో కడుక్కోవడానికి వీలయ్యే ఫిల్టర్లు ఉంటాయి. హుడ్ సరిగ్గా పనిచేయాలంటే ఫిల్టర్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, కనీసం సీజన్‌కు ఒకసారైనా మొత్తం హుడ్ను క్లీన్ చేయాలి.
ముఖ్యంగా బేకన్, చికెన్, వేపుళ్లు చేసేటప్పుడు నూనె చిటపటలాడి మీద పడుతుంటుంది. అలాంటప్పుడు మూత లేదా స్ప్లాటర్ స్క్రీన్ వాడితే సగం సమస్య తీరిపోతుంది. స్టవ్ ఈజీగా ఉంటుంది, బట్టల మీద నూనె పడకుండా ఉంటుంది, ఆ గార్డ్‌ను నేరుగా డిష్వాషర్లో వేసి కడుక్కోవచ్చు. అలాగే వంట చేసేటప్పుడు మంట ఎక్కువగా పెడితే నూనె ఎక్కువ చిట్కడంతో పాటు పొగ వస్తుంది. ఆ పొగలోనే జిడ్డు కణాలు ఉండి ఇళ్లంతా అంటుకుంటాయి. అందుకే వేపుళ్లు, సాటే చేసేటప్పుడు మంట తగ్గించి వండాలి. అవాకాడో, సాఫ్ట్ఫ్లవర్, వేరుశెనగ నూనె లాంటి హై స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను వాడితే కిచెన్ త్వరగా జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఇక, కొన్నిసార్లు డీప్ ఫ్రైకి బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులు వాడటం మంచిది. ఎయిర్ ఫ్రైయర్లో చాలా తక్కువ నూనె పడుతుంది, అది ఎక్కడా చిందదు. స్లో కుక్కర్, ప్రెషర్ కుక్కర్ లేదా ఓవెన్‌ను వాడితే నూనె ఆ వంటపాత్రలకే పరిమితమవుతుంది. ఓవెన్‌ను తర్వాత శుభ్రం చేసుకోవాల్సి వచ్చినా, కిచెన్ మొత్తం క్లీన్ చేయడంతో పోలిస్తే ఇది చాలా ఈజీ. రోజుకొక ఐదు నిమిషాలు కేటాయించి ప్రతి రోజూ రాత్రి లేదా వంట అయిపోయిన వెంటనే స్టవ్, కౌంటర్లు, బ్యాక్స్ప్లాష్ను తుడిచేసుకుంటే ఆ తర్వాత పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జిడ్డు జిడ్డుగా మారకుండా ఈజీగా వదిలిపోతుంది, మంత్లీ క్లీనింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇవన్నీ కాకుండా వంటగదిలోని కిటికీ తెరిచి ఉంచితే గాలి బాగా వచ్చి జిడ్డు త్వరగా ఉపరితలాలపై పేరుకుపోదు. హుడ్ సరిగ్గా పనిచేయకపోతే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌ను కూడా వంటగదిలో వాడొచ్చు.
Also Read
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
తాజావార్తలు
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
-
World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!