ప్రజంట్ పెద్ద హీరోలు నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాలు పక్కన పెడితే .. కంటెంట్‌ను నమ్ముకున్న మీడియం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం వరుస పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిలో మొదటిది ‘సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు. ఇక ట్రైలర్ , టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘సింగిల్’ మూవీ ఈ రోజు (మే 9) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : Amina Nijam : తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యూటీ..
ఓ చిన్న కథ ను ఎంతోఅద్భుతమైన కథనంతో ముందుకు నడిపించిన దర్శకుడు కార్తీక్‌రాజును నిజంగా అభినందించాలి. మూడు పాత్రల చుట్టూ తిప్పుతూ ఎక్కడా విసుగు లేకుండా సినిమాను రన్ చేశాడు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా డైలాగులు కూడా బాగా రాసుకున్నాడు. కొన్ని కామెడీ డైలాగులు బాగా పేలాయి. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. స్క్రీన్ అంతా రిచ్‌గా ప్రజెంట్ చేయగా.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా బావుంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బావున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ పై పాన్ ఇండియా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.. ‘ గీతాఆర్ట్స్ బ్యానర్‌లో చేరిన ‘సింగిల్’ మూవీ టీం కు శుభాకాంక్షలు. అందరికీ ఆల్ ది బెస్ట్ ’ అంటూ ‘మై బ్రదర్ శ్రీవిష్ణు మీకు కూడా ఆల్ ది బెస్ట్’ అంటూ పోస్ట్ లో పేర్కోన్నాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
Wishing my dearest cousin #VidyaKoppineedi who has joined the bandwagon of #GeethaArts . All the very best for the release of #SingleMovie .
Big cheers to my brother @sreevishnuoffl garu on the film hitting screens today.
Best wishes to the young ladies @TheKetikaSharma… pic.twitter.com/A48jrMGFLI— Allu Arjun (@alluarjun) May 9, 2025