UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI MDR Charges: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీఐ మార్చెంట్ లావాదేవీలపై ఆమోదించిన ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) ఛార్జీల అమలును నవంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 13న) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ గురువారం నుంచే ఈ ఛార్జీలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, పండుగ వేళ తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూపీఐ స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీపావళి తర్వాత ఏ తేదీ నుంచి ఛార్జీలు అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో ఈ అంశంపై మరో ప్రకటన విడుదల చేస్తామని, అందులో తేదీని ప్రకటిస్తామని NPCI పేర్కొంది. ఇక, దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. ఇటీవల ఈ ఛార్జీలను 2027 జనవరి వరకు వాయిదా వేయాలని NPCI యోచిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటన వెలుగులోకి వచ్చింది.
గత నెలలోనే యూపీఐ స్టీరింగ్ కమిటీ రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.4 శాతం (40 బేసిస్ పాయింట్లు) ఎమ్‌డీఆర్ ఛార్జీ విధించాలని నిర్ణయించింది. సాధారణంగా మనం డిజిటల్ పేమెంట్లు స్వీకరించినందుకు వ్యాపారులు చెల్లించే రుసుమునే ఎమ్‌డీఆర్ అంటారు. ఉదాహరణకు 0.4 శాతం ఛార్జీ అంటే.. రూ. 2,000 లావాదేవీకి రూ. 8, అదే రూ. 10,000 లావాదేవీకి రూ. 40 వరకు ఎమ్‌డీఆర్ ఛార్జీ పడుతుంది. అయితే, ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఈ ఛార్జీల వల్ల పండుగ అమ్మకాల వేళ వ్యాపార వ్యయం పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అంతేకాకుండా, వ్యాపారులు ఈ ఛార్జీలను ఏదో ఒక రూపంలో వినియోగదారులపైనే మోపే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ అంశంపై అక్టోబర్ 8న కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. యూపీఐపై ఎమ్‌డీఆర్ అంశాన్ని దానికి సంబంధించిన వాటాదారులే చూసుకుంటారని, ఛార్జీలను ఎప్పుడు ప్రారంభించాలనే నిర్ణయాన్ని పేమెంట్స్ వ్యవస్థకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!