Operation Sindoor: మార్కెట్‌లో దొరికి మేడిన్ చైనా వస్తువులు.. తక్కువ ధరకే దొరికినా.. నాణ్యత మాత్రం డొల్లా అనే అపవాదులు ఉన్నాయి.. చైనా తయారు చేసిన వస్తువులు మార్కెట్‌లో ఇప్పటికీ విరివిగా దొరికినా.. అవి ఎలా పనిచేస్తాయి..? ఎన్నిరోజులు ఉంటాయి? ఎప్పుడు పేలతాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది.. అయితే, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. దాడులు, ప్రతిదాడుల సమయంలోనూ మేడిన్ చైనా ఆయుధాలు తుస్సుమంటున్నాయట.. దీంతో.. మేడిన్ చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా తుస్సే అని నిరూపితమైందంటున్నారు.. దీనిపై డ్రాగన్ కంట్రీని సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు నెటిజిన్లు..
Read Also: India Pak War: మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నాం.. భారత రాయబారి వినయ్ క్వాత్ర
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పేలకుండా తుస్సుమన్న మిస్సైల్‌ను గుర్తించారు పోలీసులు.. భారత్‌పై పాక్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిగా తేల్చారు.. మరోవపు, లాహోర్‌లోని HQ-9B AD వ్యవస్థను ఇండియా ధ్వంసం చేసింది.. దీంతో.. మేడిన్ చైనా అంటే ఇలాగే ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం తన రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ సైన్యం గందరగోళంలో పడిపోయిందట.. భారత డ్రోన్ మరియు క్షిపణి దాడులు లాహోర్‌లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాల బలహీనతలను బయటపెట్టాయి, ఇక్కడ ఒకప్పుడు బలంగా ఉన్నాయని భావించిన మేడిన్ చైనా భద్రతా వ్యవస్థలు.. ఈ దాడులను ఆపడంలో విఫలమయ్యాయి.
చైనా నుంచి పాక్ అధిక ధరకు కొనుగోలు చేసిన క్షిపణులు, బాంబుల వంటి చైనా ఆయుధాలు, పరికరాల నాణ్యతమై ఓవైపు.. వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్తాన్ దళాలకు లేదని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది చైనా నిర్మిత సైనిక గేర్ ప్రభావంపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతోంది. అనేక మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని.. యుద్ధ సమయంలో అలాంటి పరికరాలపై ఆధారపడటానికి ఇష్టపడటం లేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలను విక్రయించింది.. కానీ, వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో వారి దళాలకు శిక్షణ ఇవ్వలేదు. వాటిపై కనీస జ్ఞానం లేకపోవడం వల్ల పాకిస్తాన్.. భారతదేశం జరిపిన దాడులకు ప్రతిఘటించడంలో నిస్సహాయంగా మారింది. భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌గా పెట్టుకోగా.. పాకిస్తాన్ సైన్యం మాత్రం.. తమ సోదరులుగా భావించే ఉగ్రవాదులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. ఇటీవలి ప్రతిఘటనలో, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చైనా కొనుగోలు చేసిన HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించి, భారతదేశంపై క్షిపణి, డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. అయితే, భారతదేశం యొక్క S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ యొక్క అనేక క్షిపణులు, డ్రోన్‌లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు నాశనం చేసింది. ఇది పాకిస్తాన్ ఆధారపడిన చైనా పరికరాల విశ్వసనీయత గురించి చర్చకు దారితీసింది.