200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- OPPO Find X10 సిరీస్ అక్టోబర్ 22న భారత్‌లో లాంచ్
- సిరీస్‌తో పాటు OPPO Enco X4 ఇయర్‌బడ్స్, OPPO Pad Mini Matte Display Editionను విడుదల
- Find X10 సిరీస్‌లో ట్రిపుల్ 200MP కెమెరా సిస్టమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X10 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఒప్పో (OPPO) తన ఫ్లాగ్షిప్ Find X10 సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. OPPO Find X10 సిరీస్‌ను అక్టోబర్ 22న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్‌తో పాటు OPPO Enco X4 వైర్లెస్ ఇయర్‌బడ్స్, OPPO Pad Mini Matte Display Editionను కూడా విడుదల చేయనుంది.
OPPO Find X10 సిరీస్‌లో కెమెరాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. హ్యాసెల్‌బ్లాడ్‌తో OPPO కొనసాగిస్తున్న భాగస్వామ్యంలో భాగంగా ఈ ఫోన్లలో ట్రిపుల్ 200MP కెమెరా సిస్టమ్‌ను అందించనున్నారు. ముఖ్యంగా Find X10 Pro Maxలోనూ ఇదే కెమెరా సెటప్ ఉండనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా వెల్లడించింది. వీటితో పాటు OPPO Hasselblad Teleconverter లెన్స్ యాక్సెసరీని కూడా తీసుకురానుంది. ఇది ఫోన్ కెమెరా మాడ్యూల్‌పై నేరుగా అమర్చుకునేలా రూపొందించారు. దీంతో మొబైల్ ఫొటోగ్రఫీని మరింత ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. ఈ సిరీస్ ColorOS 17పై పనిచేయనుంది.
Also Read
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
Find X10 సిరీస్‌తో పాటు OPPO Pad Mini Matte Display Editionను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందించనున్నారు. ఇందులో 8.8 అంగుళాల 2.5K OLED Eye-Comfort Matte డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్‌పై రిఫ్లెక్షన్స్, గ్లేర్‌ను తగ్గించేలా దీన్ని రూపొందించారు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 2.99mm అల్ట్రా-థిన్ బెజెల్స్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. స్టైలస్‌తో రాయడానికి, స్కెచ్‌లు వేయడానికి పేపర్‌పై రాస్తున్న అనుభూతిని అందించే ట్యాక్టైల్ ఫినిష్ కూడా ఇందులో ఉంటుంది. సన్నని, తేలికైన బాడీతో ఒక చేత్తో సులభంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. 8,000mAh బ్యాటరీని ఇందులో అందించనున్నారు.
అలాగే OPPO Enco X4 ఇయర్‌బడ్స్‌ను ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేలా రూపొందించారు. ఇందులో డ్యూయల్ డైనమిక్ డ్రైవర్లతో పాటు డ్యూయల్ DACలను అందించారు. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఆడియో సంస్థ Dynaudioతో కలిసి వీటిని ట్యూన్ చేశారు. AI ఆధారిత Real-time Adaptive ANC ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణంలోని శబ్దాలను బట్టి నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
లాంచ్‌కు ముందే ఒప్పో ఇండియా అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో రూ.9 ప్రివిలేజ్ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 21 రాత్రి 11:59:59 గంటల్లోపు ఈ ప్యాక్‌ను కొనుగోలు చేసిన వారికి అక్టోబర్ 22 నుంచి 25 వరకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. Find X10 లేదా Find X10 Pro Max కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ప్రీమియం గిఫ్ట్ బాక్స్ లభిస్తుంది. ఇందులో Enco Air5 Pro ఇయర్‌బడ్స్‌తో పాటు సంబంధిత ఫోన్ కేస్ ఉంటాయి. అలాగే మొదటి 50 మంది కస్టమర్లకు OPPO Pad SE (4GB + 128GB Wi-Fi) ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీనితో పాటు OPPO Pad Miniపై రూ.1,000 డిస్కౌంట్ కూపన్, OPPO Enco X4పై రూ.500 డిస్కౌంట్ కూపన్ కూడా అందించనున్నారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!