Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Explosion in Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని విషాదం చోటుచేసుకుంది.. కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సమీపంలోని ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా జిలెటిన్ స్టిక్స్ పేలాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: Varun Tej: ‘బరి’ షూటింగ్‌లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనో 25 మందికి పైగా తీవ్రగాయాలపాలు కాగా.. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మబున్నీ, మధు, సంపత్, వెంకన్నగా గుర్తించారు అధికారులు.. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఘటన తీరును.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు..
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!