Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumo Didi: ఆడపిల్ల శరీరం ఎలా ఉండాలి, ఆమె బరువు ఎంత ఉండాలి, ఏ రంగాల్లో రాణించాలి అనే విషయాలపై సమాజం గీసిన గిరిగీతలను ప్రశ్నిస్తూ వెండితెరపైకి వస్తోంది సరికొత్త స్పోర్ట్స్ డ్రామా ‘సుమో దీదీ’. భారతదేశపు మొట్టమొదటి మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత పోరాటాన్ని కళ్ళకు కడుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హిందీ విడుదల చేసిన ఈ సినిమా అధికారిక ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళల బరువు, రూపురేఖలను చూసి గేలి చేయడం సమాజంలో ఎంతటి మానసిక క్షోభను కలిగిస్తుందో ట్రైలర్ ఆరంభంలోనే సూటిగా తాకింది. సాంప్రదాయ బద్ధమైన మార్వాడీ కుటుంబంలో పుట్టిన అమ్మాయిపై పడ్డ నిందలు, “బరువు తగ్గకపోతే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అనే మాటలు, స్పాన్సర్‌షిప్‌ల కోసం తిరస్కారాలు ఎదురైనా ఆమె ఏనాడూ వెనకడుగు వేయలేదు. తన బలహీనతగా లోకం వేలెత్తి చూపిన భారీ కాయాన్నే అతిపెద్ద ఆయుధంగా మార్చుకుని, జపాన్ దేశానికే సొంతమైన సుమో రింగ్‌లో భారత జెండాను రెపరెపలాడించిన హేటల్ నిజ జీవిత ప్రయాణం వెన్నులో వణుకు పుట్టించేలా కనిపిస్తుంది.
జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. హేటల్ డేవ్ టైటిల్ పాత్రలో నటి శ్రియం భగ్నాని పరకాయ ప్రవేశం చేయగా, నటుడు చైతన్య శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. జపాన్, ముంబై, కోల్‌కతాలలో చిత్రీకరించిన ఈ బయోపిక్ ఇప్పటికే టోక్యో, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జీ5 హిందీ వేదికగా అక్టోబర్ 23, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘సుమో దీదీ’.. సమాజం నిర్ణయించిన హద్దులను బద్దలుకొట్టి గెలవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఓ బలమైన స్ఫూర్తిని నింపడం ఖాయం అని చెబుతోంది టీం.
Also Read
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
- E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!