Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar Yadav: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా.. తమకు కేటాయించే స్థానాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది.. ఈ పథ్యంలో మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 72 నూతన 104 ఎంఎంయూ (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, హెల్త్ కమిషనర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం నూతన వాహనాలతో ధర్మవరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలపై సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు. వారి త్యాగాలను వృథా కానివ్వబోమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సత్యకుమార్ చెప్పారు. కింది స్థాయిలోనూ మూడు పార్టీల నేతలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. గతంలో మాదిరిగా అప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని మంత్రి సత్యకుమార్ అన్నారు. ధర్మవరంలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆ అభివృద్ధిని ప్రజల ముందుంచి ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..