జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డిని వైసీపీ లోకి ఆహ్వానించామని వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. క్రాంతి రెడ్డి అందుకు అంగీకారం తెలిపారని.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. మను క్రాంత్ రెడ్డి హోదా .అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని., ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటాం అన్ని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో ఆరు సంవత్సరాలుగా ఉన్న ఆయన చేరిక వల్ల పార్టీ కూడా బలోపేతమవుతుంది.
Also Read: కవ్వింపులతో కుర్రకారు గుండెలు దోచేస్తున్న ఖుషీ కపూర్..
ఇక ఈ చేరికలపై జనసేన జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డి మాట్లడుతూ.. నన్ను వైసీపీ లోకి ఆహ్వానించారు., ఈ గౌరవం కొద్ది మందికే దక్కిందని., తాను పార్టీ నేతలతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఆరు సంవత్సరాల నుంచి తాను జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నా అని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా తాను నిర్వహిస్తున్నట్లు చెబుతూ.. ఏడాదిన్నర నుంచి ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అండగా ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Rahul Gandhi: ‘అబద్ధాల మూటతో చరిత్ర మారదు’.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు
ఇంకా నాతో పాటు పలువురు వైసీపీలో చేరుతారని., ఈ విషయం పై వారితో కూడా చర్చిస్తాం అని చెప్పుకొచ్చాడు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేశాను., కాకపోతే ఈసారి పోటీకి అవకాశం రాకపోవడంతో కొంత బాధ కలిగిందని.. కాబట్టి జనసేన పార్టీని వీడేందుకు అది కూడా ఒక కారణం కావచ్చు అని మాట్లాడారు.