జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డిని వైసీపీ లోకి ఆహ్వానించామని వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. క్రాంతి రెడ్డి అందుకు అంగీకారం తెలిపారని.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. మను క్రాంత్ రెడ్డి హోదా .అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని., ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటాం అన్ని చెప్పుకొచ్చారు.…