Off The Record: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. అందునా….. రాజకీయ రుచులు మరిగిన వారు అస్సలు ఆగలేరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తుతం ఈ యాంగిల్‌లోనే హాటు ఘాటు చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయి… తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పేశారని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ నిబద్ధతలేని వారే ఉన్నారని, అంతా ఒక కోటరీగా ఏర్పడి…
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..
ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది.
వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభించారన్నారు. కొండా సురేఖను జగన్ పట్టించుకోలేదని.. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక స్థానం జగన్ కే సొంతం అని విమర్శించారు.. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు..
మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (ఏప్రిల్ 18న) విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతడిని సిట్ కోరింది.
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్..
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు..
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.