Chittoor: పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరం. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. అలానే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అందుకే ప్రభుత్వం శిశు సంరక్షణ పథకం కింద అంగనవాడి కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణి చేస్తుంది. అయితే ప్రభుత్వం పంపిణి చేసే పౌష్ఠిక ఆహారంలో నాణ్యత ఉంటుందా? అనే సందేహం కొందరికి కలుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే పౌష్ఠిక ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు అవుతుందేమో ఆ ఆహరం తింటే అని భయపడుతున్నారు.
Read also:Uttar Pradesh: అన్నను చంపిన తమ్ముడు.. సహకరించిన తల్లి, చెల్లి
దీనికి చింతూరులో వెలుగు చూసిన ఈ సంఘటనే కారణం. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, శాంతినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఓ ఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయినటువంటి ఓ మహిళా అంగన్వాడీ కేంద్రం నుండి పౌష్టికాహారాన్ని తీసుకుంది. అనంతరం ఇంటికి వెళ్లి పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూడగా అందులో పాము కళేబరం దర్శనమిచ్చింది. దీనితో ఆశ్చర్యానికి గురైన ఆ మహిళా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ని కలిసి విషయం చెప్పింది . అనంతరం అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని సీడీపీఓ సంధానం ఇచ్చింది.