Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ జిల్లాలో అక్రమ్ అనే యువకుడు ఆస్తికోసం సొంత అన్ననే చంపాడు. అయితే చిన్న కొడుకు చేస్తుంది తప్పు అని చెప్పాల్సిన తల్లి, చెల్లి కూడా అతనికి సహకరించారు. అయితే షెహజాద్ ఆత్మహత్య చేసుకున్నాడని నిందితులే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే మరణించిన వ్యక్తి భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చెప్పట్టారు పోలీసులు.
Read also:Israel–Hamas war: హమాస్ ఆర్థిక మంత్రిని చంపిన ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్..
దీనితో అసలు నిజాలు బయటకు వచ్చాయి. లోహియానా గర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆషియాన కాలనీలో షెహ్ జాద్ అనే వస్త్ర వ్యాపారి నివసిస్తున్నాడు. అయితే కొని రోజులుగా అతనికి తన తమ్ముడికి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నని మాట్లాడాలి అని ఓ గదిలోకి తీసుకెళ్లాడు అక్రమ్. వెంటనే రాడుతో అన్న చాతి పైన కొట్టాడు అనంతరం గొంతు నులిమి చంపేశారు. అయితే అక్రమ్ కు తల్లి, చెల్లి కూడా సహకరించారు. కాగా షెహజాద్ మృత దేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని ప్రయత్నించారు. వాళ్ళ వ్యూహం ఫలించలేదు. కాగా హత్య జరిగిన సమయంలో మృతుడి భార్య బిడ్డలు మేడపైన నిద్రిస్తున్నారు. భార్య బిడ్డల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు వారిస్తున్న వినకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా సోమవారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు