తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
Uttam Kumar Reddy : జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయల సీమ ఎత్తిపోతల పథకంతో పాటు బంకచర్ల ఎత్తిపోతల పథకం నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిబంధనలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ఏపీ నిర్మిస్తున్న ఆర్ఎల్ఐసితో పాటు బంకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగు…
Uttam Kumar Reddy : కృష్ణా జలాలతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఆర్.ఎల్.ఐ. సి నిర్మాణం ఏ.పి ప్రభుత్వం చెపట్టిందంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా…
అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది. Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని…
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ…
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిపారు. తెలంగాణ సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలన చేసింది. కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడినట్లు అర్థం అవుతోంది’’ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా అని ప్రశ్నిచింది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేక హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా అని పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది ఎన్జీటీ. అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదన్న ఎన్జీటీ… పర్యావరణ శాఖతో ఏపీ…
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించింది కేఆర్ఎంబీ. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన కేఆర్ఎంబీ.. డీపీఆర్ కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు ధృవీకరించిన కేఆర్ఎంబీ.. పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్థారించింది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన కేఆర్ఎంబీ అధికారులు… ప్రాజెక్టులో…
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ టీమ్…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్‌రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది.…