Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ…
ఈ ఏడాది క్లౌడ్ బరస్ట్‌లు కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు. Also Read:KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్…
Argentina: అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది గల్లంతయ్యారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. అర్జెంటీనాలోని తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరంలో వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి వచ్చిన వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రాజధాని బ్యూనస్ అయర్స్‌కు దక్షిణంగా ఉన్న బహియా బ్లాంకా నగరం నుంచి 1,450…
వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు సహృదయ నేస్తాలు స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో సోమవారం కలిసి పలువురు చెక్కులు అందించారు.
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు.
సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని కృష్ణా నది, బుడమేరు వరద అతలాకుతలం చేసింది.. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్ట పరిహారం పంపిణీపై దృష్టిసారించింది.. ఈ రోజు నాలుగు లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమచేసింది ప్రభుత్వం..
వరద బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు..