నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read: Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని నాని చెప్పిన మాటలు మెరిసాయి రుజువయ్యాయి. ఇంత వర్షం లో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే చిన్నా విషయం కాదు. ప్రస్తుతం కలెక్షన్స్ చూస్తూనే లాంగ్ రన్ గట్టిగా వుండబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్జే సూర్య గారి పెర్ఫర్ఫార్మెన్స్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సుందరానికీ విషయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ కొంత నిరాశపరిచినా ‘సరిపోదా శనివారం’ అవకాశంఇచ్చాడు నాని. ఆ అవకాశన్ని దర్శకుడు సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. సరిపోదా శనివారం విజయ వేడుకను సెప్టెంబర్ 5న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సాయంత్రం 6:00గంటలకు నిర్వహిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా 90% రికవరీ సాధించింది.ఈ వారాంతానికి ఈ చిత్రం లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి