Minister Bala Veeranjaneya Swamy: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచింది.. అంతేకాదు.. ప్రతీ నెల ఫస్ట్ రాకముందే.. ఈ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.. సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికి వెళ్లే పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. అఇయతే, దేశంలోనే అత్యధిక పింఛన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఇస్తున్నాం.. అనవసరంగా ప్రభుత్వంపై నింధలు వేయడం కరెక్ట్ కాదని హితవు చెప్పారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు.. గత ప్రభుత్వంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగాలకు కూడా వెళ్లలేకపోతున్నారన్న ఆయన.. జగన్ ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, వైఎస్ జగన్ నష్టపరిచిన వ్యవస్థల్ని చక్కదిద్దుతున్నాం. జగన్ కి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి.. ఈసారి ఒక్క సీటు కూడా రాదు అంటూ జోస్యం చెప్పారు.. గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ ఒప్పందాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అంతేకాదు.. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే, ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబుదే అన్నారు.