పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని తెలిపారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.