గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించే పరిస్థితి లేదని, పని భారం విభజన జరుగుతోంది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామన్నారు. రేషనలైజేషన్ వల్ల పని భారం తగ్గుతుందని, సచివాలయాల సంఖ్య పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.…
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.