ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గంలో చోటు దక్కినవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు పదవి కోల్పోయినవారు, ఈసారైనా మంత్రి పదవి వస్తుందని ఆశించి నిరాశకు గురైనవారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీపై ఆయన అలకబూనారు.. ఇక, అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలినేని ఇంటికి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.. అయితే, ఇవాళ బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసంలో ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు భేటీ కావడం చర్చగా మారింది..
Read Also: Kotamreddy: మంత్రపదవి రాలేదన్న బాధ ఇంకా ఉంది.. అయినా జగన్ కోసం పనిచేస్తా..
బాలినేని నివాసానికి చేరుకుంటున్నారు ప్రకాశం జిల్లా నేతలు.. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులతో బాలినేని సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి కూడా బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు.. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, బాలినేని నివాసంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా.. బాలినేని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, బాలినేని అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే అయినా.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరనే చర్చ కూడా సాగుతోంది.