Posani Krishna Murali Challenges Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ ఫిలిమ్ కార్పొరేషన్ డైవలప్‌మెంట్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను ఓడించేంత బలం పవన్‌కు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. జగన్‌ను ఓడించేంత సత్తా పవన్‌కు ఉంటే.. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయన్ను ఎందుకు సీఎం చేయలేకపోయాడని అడిగారు. తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్తున్న పవనే మొదట తిట్టడం ప్రారంభించాడని మండిపడ్డారు. వయసులో తనకంటే చిన్నవాడైన జగన్ సీఎం అయ్యాడన్న అక్కసుతోనే పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.
Shivathmika Rajashekar: రాజశేఖర్ కూతురా.. ? మజాకానా..? ఎంత అందంగా ఉందో
జగన్‌పై నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న పవన్.. ఫలానా అవినీతి జగన్ చేశారని సాక్ష్యాలతో నిరూపించగలడా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. 175 స్థానాల్లో గెలుస్తామని వైసీపీ అంటున్నామని, తామేమైనా నోట్లో వేళ్లు పెట్టుకుని కూర్చున్నామా అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారని.. అసలు నీకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? నిలదీశారు. పవన్ కళ్యాణ్ నిజంగా దమ్ముంటే.. 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేసి, వారికి నష్టం చేస్తున్నాడని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభాన్ని, కాపు నాయకులను పవన్ తిట్టడం సమంజసం కాదన్నారు. గోదావరి జిల్లాల్లో పర్యటించి, కొన్ని సీట్లు చంద్రబాబుకు అప్పగిస్తానంటే.. కాపులు ఊరికే ఉంటారా? అని అన్నారు. కాపుల కోసం పదవులు కోల్పోయిన వ్యక్తి ముద్రగడ అని.. అలాంటి వ్యక్తిని పవన్ తిట్టించడం దారుణమని ఫైరయ్యారు.
Anupama Parameswran : ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఎంతో బాధ పడ్డాను..
దేశంలోనే ఎక్కడా ఇవ్వని సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారని పోసాని కృష్ణమురళి కొనియాడారు. నేను చదువుకున్నప్పటికి, ఇప్పటి స్కూళ్లకు చాలా తేడా వచ్చేసిందన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని.. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి జగన్‌కు మద్దతు ఇస్తున్నారని అన్నారు. సీఎం జగన్ తన తండ్రి కంటే గొప్పగా పరిపాలిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబుపై ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పోయిందని.. తాను అధికారంలోకి వస్తే పిల్లలను కూడా పుట్టిస్తానని చంద్రబాబు ప్రచారం చేయగలడని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్ర ప్రజలు తమ భవిష్యత్‌ని తామే నాశనం చేసుకున్నట్టు అవుతుందని సూచించారు.