Helicopter Emergency Landing: బాలయ్యకు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopter Emergency Landing: నందమూరి బాలకృష్ణ ప్రయాణించిన హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు హీరో బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్ తదితరులు హెలికాప్టర్‌లో బయల్దేరారు.. అయితే, 15 నిమిషాల తర్వాత ఒంగోలులోనే అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు పైలట్.. దీంతో, బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అందుకే.. హెలికాప్టర్ వెనుదిరిగినట్టు వార్తలు వచ్చాయి.. దీనిపై హెలికాప్టర్ పైలట్ క్లారిటీ ఇచ్చారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పైలట్ ఎస్కే జానా.. పొగమంచు కారణంగా హెలికాప్టర్ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు.. హైదరాబాద్ కు ప్రయాణించే మార్గం క్లియరెన్స్ లేకపోవటం వల్ల వెనుతిరిగామన్నారు. ప్రస్తుతం ఏటీసీ నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు.. అయితే, హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదని క్లారిటీ ఇచ్చారు.. కేవలం వెదర్ కండిషన్ బాగాలేకపోవటం వళ్లే వెనక్కు వచ్చామన్నారు. ఏటీసీ నుండి క్లియరెన్స్ రాగానే బయల్దేరనున్నట్టు వెల్లడించారు పైలట్ ఎస్కే జానా..
Read Also: Vijayawada: ఏపీ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ అనుమానాస్పద మృతి.. హోటల్ రూమ్‌లో మృతదేహం..
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
కాగా, నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. తన తాజా చిత్రం వీర సింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం నిన్న ఒంగోలు వెళ్లిన బాలయ్య.. రాత్రి అక్కడే బస చేశారు.. అయితే, ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.. కానీ, హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి..కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికగా ట్రైలర్‌ను వదిలి మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. బాలయ్య ఊర మాస్ లుక్, పంచ్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. “సీమలో ఏ ఒక్కడు కట్టి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి.. పుట్టి పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!