Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu Naidu: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం.. అంబేద్కర్ భవన్‌లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో సీఎం జగన్‌కు అనేకమంది మహిళలు తమ కష్టాలు తెలిపారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చెందారన్నారు. అందుకే.. సీఎం జగన్ మహిళల కష్టాలను విని.. నవరత్నాలులో వైఎస్సార్ ఆసరాను పొందుపరిచారన్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. రెండో మూడో ఎమ్మెల్సీలు గెలవగానే.. అధికారంలోకి వచ్చామని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కంటే వైసీపీకి మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబులాగా సీఎం జగన్ రైతులను, మహిళలను మోసం చేయలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
Jasprit Bumrah : బుమ్రా గాయంపై వీడని సస్పెన్స్! అసలు విషయం దాస్తున్న బీసీసీఐ..
అంతకుముందు.. వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం జగన్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలోనూ అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్‌ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని.. మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని తెలియజేశారు.
GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది