ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో మార్కెట్ యార్డుల వద్ద ఉల్లి ట్రాక్టర్లు బారులు తీరాయి. ఉల్లి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ట్రాక్టర్లను అడ్డుగాపెట్టి ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే ఉల్లిని కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read: భారత్‌తో వాణిజ్యంపై తాలిబన్ కీలక నిర్ణయం… నిలిపివేత…