కరీంనగర్‌లో గుంతలు ఉన్న రోడ్డుపై కూర్చుని వాహనదారుడు నిరసన తెలిపారు.. నిబంధనలు పాటించకపోతే మాకు వేసే జరిమానాలు సరే.. మరి రోడ్లు బాగులేనందుకు మీరు నాకు ఎంత చెల్లిస్తారు జరిమానా అంటూ.. రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై నిరసనకు దిగాడు కోట శ్యామ్ అనే ద్విచక్రవాహనదారుడు.. గుంతలు ఉన్న రోడ్డులో కూర్చుని నిరసన తెలిపాడు.
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబావుటా ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘హమాస్ అవుట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని.. హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు…
గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు, తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ దేశంలో భారీ హింసను చూసింది. బంగ్లాదేశ్‌లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజిద్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ చర్యలో కనీసం 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం బుధవారం అంచనా వేసింది.
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా కొనసాగించేందుకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా స్థలాల కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే, స్థానిక భూ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుతో…
MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన హౌసింగ్ బోర్డ్ వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. హౌసింగ్ బోర్డ్ ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించారని తెలిపారు. కానీ, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆ రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపించి, వేలం…
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్…
కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు.