Vijayawada: లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించిన పోలీసులు

విజయవాడలో మరోసారి కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడకు వచ్చి లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి … Continue reading Vijayawada: లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించిన పోలీసులు