గూడూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అది ఆత్మహత్య కాదు హత్య అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసారు పోలీసులు. 100 నంబర్ ద్వారా అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు పై విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంకటేష్ స్నేహితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితుడు మాత్రం పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదని మేము ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులకు చెబుతున్నాడు.