పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు.. ఆమె.. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ ఇద్దరు.. కలిసి చదువుకోవడమే కాదు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు కూడా! స్నేహితులుగానే మెలుగుతూ వచ్చిన ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలీదు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరన్న సంగతి గ్రహించి.. తాము ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నారు. అతడి కంటే ఆమె రెండేళ్ళు పెద్దది. అయినా, ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది? అయితే.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయికి…
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్నవారి దగ్గర సుఖం దొరకట్లేదని పరాయి వారి మోజులో పడుతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరమవుతున్నారు. తాజాగా ఒక వివాహిత .. వావి వరస మరిచి మరిదితో అఫైర్ పెట్టుకోంది. ఆ విషయం కొద్దిరోజులకు భర్తకు తెలిసి చీవాట్లు పెట్టాడు. అంతే.. ప్రియుడితో పాటు ఇంట్లోనుంచి పారిపోయి శవాలుగా తేలారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక మహిళకు…