వెలుగొండ అడవుల్లో అదృశ్యమైన మూడేళ్ల బాలుడు సంజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చెప్పట్టారు. అయితే తొమ్మిది రోజులైనా బాలుడు దొరకలేదు. ఉయ్యాలపల్లితో పాటు పరిసర గ్రామాల్లో యువకులని బృందాలుగా ఏర్పాటు చేసి…పోలీసు, యువకుల బృందాలు విడిపోయి గాలిస్తున్నారు. ఉయ్యాల పల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో నేటి నుంచి గాలింపు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ లకు బాలుడి సమాచారం అందించారు. వాల్ పోస్టర్లను సోషల్ మీడియాకు విడుదల చేసిన పోలీసులు… బస్సు,ఆటోలకు పోస్టర్లను అతికించారు. వారం రోజుల కింద ఊర్లో కి ఎవరెవరు కొత్తవారు వచ్చారో ఎంక్వైరీ చేస్తున్నారు. ఊర్లోకి వచ్చిన కొత్త వారిని కనుక్కోవడానికి మొబైల్ ట్రాకింగ్ చేస్తున్నారు… పిల్లవాడు కిడ్నాప్ అయ్యాడు…అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఈపాటికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు