Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఒక బ్యానర్లో పనిచేసే వ్యక్తుల మధ్య మంచి అనుబంధం ఏర్పడితే.. అదే బంధం కొనసాగుతుందని, దానికి ప్రత్యేకమైన అగ్రిమెంట్లు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల కాంపౌండ్స్, దర్శకుడు త్రివిక్రమ్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వారి కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. తన బాబాయి (చిన్నబాబు) ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న సమయంలో తొలి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని కోరుకున్నారని తెలిపారు. త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకు ఉన్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో ‘జులాయి’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్‌తో తమ అనుబంధం మరింత బలపడిందని నాగవంశీ పేర్కొన్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అనే బ్యానర్ పేరును కూడా త్రివిక్రమే సూచించారని, ఆ బ్యానర్ లోగోను సైతం ఆయనే డిజైన్ చేశారని వెల్లడించారు. “అప్పటి నుంచి ఇప్పటివరకు త్రివిక్రమ్ బయట బ్యానర్లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్లు లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఒక ఫ్యామిలీలా అయిపోయాం” అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
త్రివిక్రమ్ తమ బ్యానర్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. తమ వైపు నుంచి కూడా ఆయనకు ఎక్స్‌క్లూజివిటీ ఇవ్వడం సహజమేనని నాగవంశీ అన్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌ను ప్రధానంగా త్రివిక్రమ్ సినిమాల కోసం కొనసాగిస్తున్నట్లు వివరించారు. అయితే త్రివిక్రమ్‌కు ఆ బ్యానర్లో వాటా ఉందనే ప్రచారంపై కూడా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో త్రివిక్రమ్‌కు ఎలాంటి షేర్ లేదని, ఆయనకు రెమ్యునరేషన్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయనకు సంబంధించిన షేర్ సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుందని తెలిపారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ కీలకంగా భాగస్వామ్యం అవుతున్నారని, స్క్రిప్టులు, ఇతర సినిమా విషయాల్లో ఆయన సలహాలు కూడా తీసుకుంటామని నాగవంశీ వెల్లడించారు. త్రివిక్రమ్‌తో తమ బంధం కేవలం సినిమాలకు సంబంధించినది మాత్రమే కాదని.. సంవత్సరాలుగా కొనసాగుతున్న అనుబంధమే తమ ప్రయాణానికి కారణమని నాగవంశీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!