Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avika Gor: బుల్లితెరపై ఆనందిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అవికా గోర్ ఇప్పుడు అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెకు డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఇంత తీవ్రమైన జ్వరంలోనూ షూటింగ్ ఆపకుండా వృత్తిపట్ల చూపించిన అంకితభావం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవికా భర్త మిలింద్ చంద్వానీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో వీడియోను పంచుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. జ్వరం తగ్గకపోవడంతో అవికాను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆమె తన పని ఆపలేదని చెప్పారు. షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే అవికా ఈ నిర్ణయం తీసుకున్నారని మిలింద్ చెప్పారు. ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదనే ఆలోచనతోనే తాను పని చేయాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. అవికాకు పని పట్ల ఉన్న అంకితభావాన్ని మిలింద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంతటి అనారోగ్య పరిస్థితుల్లోనూ తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఆమె చూపించిన పట్టుదల తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
అవికా గోర్ కు గత ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, తను ఒప్పుకున్న షూటింగ్ బాధ్యతలను పూర్తి చేసి, ఆ తర్వాత ఒక యాడ్ షూట్ కోసం ఢిల్లీకి కూడా ప్రయాణించారు. అయితే నీరసం, జ్వరం మరింత తీవ్రమవ్వడంతో డెంగ్యూ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది, దీంతో ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె నటించిన సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్ ‘బుఖార్’ (హిందీలో బుఖార్ అంటే జ్వరం) విడుదలైన రోజే ఆమె నిజంగానే జ్వరంతో ఆసుపత్రి పాలు కావడం విశేషం. అవికా కూడా ఆసుపత్రి బెడ్ నుంచే పాట రిలీజ్ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవ్వుతూ విక్టరీ సింబల్ ని చూపించిన ఆమె, తన ప్లేట్లెట్ కౌంట్ గురించి ఆందోళనతో పాటు డెంగ్యూ చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. అవికా గోర్ బాలనటిగా ‘బాలికా వధు’ సీరియల్లో ఆనంది పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘ససురల్ సిమర్ కా’ వంటి హిందీ సీరియళ్లలో నటించారు. అనంతరం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ తన కెరీర్‌ను కొనసాగించారు. ఇప్పుడు డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!