Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా వివాదంగా మారి బెదిరింపుల వరకు వెళ్లిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నిశ్చితార్థం రద్దు చేసుకున్న యువకుడిని.. కేసు ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు తెలిసింది.
తిరుపతికి చెందిన సైంటిస్ట్ వంశీకి హైదరాబాద్‌కు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న నమ్రతతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే ఆస్తులు, నగదు విషయంలో వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ వంశీ కుటుంబం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ఈ క్రమంలో నమ్రత వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వంశీపై క్రైమ్ నంబర్ 984/2025 కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వంశీ ప్రస్తుతం తిరుపతిలోని పోస్టల్ కాలనీలో తన స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. అయితే తన ఫోన్ నంబర్‌ను వంశీ బ్లాక్ చేయడంతో నమ్రత ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు వంశీ తెలిపారు. తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలంటే తనకు రూ.3 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు.
దీనితో వంశీ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని, రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. వంశీ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేటింగ్ యాప్ పరిచయంతో మొదలైన వ్యవహారం.. నిశ్చితార్థం రద్దు, పోలీసు కేసులు, ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు, రూ.3 కోట్ల డిమాండ్ వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!