Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- ది గ్రేట్ ఖలీ కంటే జుట్టే పొడవు’
- ఉత్తరాఖండ్ మహిళకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
- 8 అడుగుల 10 అంగుళాల జుట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెమలికి నాట్యం అందం స్త్రీలకు కురులు అందం. నల్లని ఒత్తైన కురులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే ప్రతిఒక్కరు జుట్టు పెంచుకునేందుకు, కేశ సంరక్షణ కోసం ఆరాటపడుతుంటారు. ఇదే రీతిలో ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధారియాల్ తన అసాధారణమైన పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యంత పొడవైన జుట్టు ఉన్న వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. రేణు ధారియాల్ జుట్టు పొడవు ఏకంగా 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు)గా నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏప్రిల్‌లో నిర్వహించిన కొలతల అనంతరం ఈ రికార్డును ధృవీకరించారు.
ఉక్రెయిన్ మహిళ రికార్డును అధిగమించిన రేణు
రేణు ధారియాల్ సాధించిన ఈ రికార్డుకు ముందు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసిరోవా పేరుతో ఈ రికార్డు ఉండేది. ఆమె జుట్టు పొడవు 257.33 సెంటీమీటర్లు (8 అడుగుల 5.3 అంగుళాలు)గా నమోదైంది. అలియా రికార్డుతో పోలిస్తే రేణు జుట్టు దాదాపు 14 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. రేణు జుట్టు పొడవు ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా నమోదైన రాబర్ట్ వాడ్లో ఎత్తుకు కూడా చాలా దగ్గరగా ఉండటం విశేషం. రాబర్ట్ వాడ్లో ఎత్తు 272 సెంటీమీటర్లు (8 అడుగుల 11.1 అంగుళాలు)గా నమోదైంది.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
2015 నుంచి జుట్టు కత్తిరించుకోలేదట
రేణు ధారియాల్ దాదాపు పదేళ్లుగా జుట్టును పెంచుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా జుట్టును కత్తిరించుకోలేదని ఆమె తెలిపారు. కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్‌గా కూడా రేణు పనిచేస్తున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జుట్టు సంరక్షణ, అందానికి సంబంధించిన చిట్కాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా సహజసిద్ధమైన ఉత్పత్తులతో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఆమె తన ఫాలోవర్లకు వివరిస్తుంటారు.
భారతీయ సంస్కృతే ప్రేరణ
పొడవాటి జుట్టు పెంచుకోవడానికి భారతీయ సంస్కృతే తనకు ప్రేరణగా నిలిచిందని రేణు తెలిపారు. భారతీయ సంస్కృతిలో పొడవాటి జుట్టును అందం, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారని, అందుకే తాను జుట్టును ఇంత పొడవుగా పెంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2015 నుంచి జుట్టును నిరంతరం పెంచుతున్నానని, అప్పటి నుంచి కత్తిరించలేదని ఆమె వెల్లడించారు.
నేలపై పరుచుకునేంత పొడవైన జుట్టు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసిన ఫొటోల్లో రేణు జుట్టు పొడవు ఎంత అసాధారణంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ఫొటోల్లో ఆమె జుట్టు నేలపై చాలా దూరం వరకు పరుచుకుని కనిపిస్తుండగా, మరికొన్ని చిత్రాల్లో మంచం అంచు మీదుగా జుట్టు కిందికి వేలాడుతూ కనిపించింది. కూర్చున్న సమయంలో కూడా ఆమె జుట్టు చుట్టూ భారీగా కనిపిస్తుంది. ఇంత పొడవు ఉన్నప్పటికీ జుట్టు మందంగా, ఆరోగ్యంగా, మెరిసేలా కనిపించడం మరో విశేషం. రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రేణు తన జుట్టును జడగా అల్లుకుంటారు.
జుట్టు సంరక్షణకు గంటల సమయం
ఇంత పొడవాటి జుట్టును సంరక్షించడం అంత సులభం కాదు. జుట్టును శుభ్రం చేయడం, చిక్కులు తొలగించడం వంటి పనులకు చాలా సమయం, సహనం అవసరమని రేణు చెబుతున్నారు. తన జుట్టు సంరక్షణ కోసం రసాయన ఆధారిత ఉత్పత్తులను దూరంగా ఉంచుతున్నానని ఆమె తెలిపారు. ఇంట్లోనే తయారు చేసుకునే సహజమైన హెయిర్ ఆయిల్స్, షాంపూలను ఉపయోగిస్తానని, వాటి తయారీ విధానాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాలోవర్లతో పంచుకుంటానని చెప్పారు.
‘నిశ్చయంతో ఏదైనా సాధించవచ్చు’
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం తనకు కేవలం పొడవాటి జుట్టుకు లభించిన గుర్తింపు మాత్రమే కాదని రేణు చెబుతున్నారు. తన సొంత ప్రాంతానికి, సమాజానికి కూడా గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు లేదా సోషల్ మీడియాలో కనిపించినప్పుడు తన జుట్టును చూసి చాలామంది ఆశ్చర్యపడి, ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు. దృఢ సంకల్పం, నిరంతర కృషి, సహనం, సహజ అందాన్ని, సంస్కృతిని గౌరవించడం ద్వారా పెద్ద లక్ష్యాలను సాధించవచ్చనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నానని రేణు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా రికార్డు
రేణు రికార్డు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆమె జుట్టు పొడవును చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు సరదాగా కామెంట్లు చేశారు. కొంతమంది ఆమె జుట్టును రాత్రివేళ చెట్టుపై కనిపిస్తే భయపడేంత అసాధారణంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. మరో సోషల్ మీడియా యూజర్ అయితే రేణు జుట్టును ప్రముఖ మాజీ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ఎత్తుతో పోల్చాడు. రేణు జుట్టు 8 అడుగుల 10 అంగుళాలు ఉండగా, ది గ్రేట్ ఖలీ ఎత్తు 7 అడుగుల 1 అంగుళం అని పేర్కొంటూ, ఆమె జుట్టే ఖలీ కంటే దాదాపు 1 అడుగు 9 అంగుళాలు ఎక్కువ పొడవుగా ఉందంటూ సరదాగా కామెంట్ చేశాడు.
Renu Dhariyal (India) has the longest hair in the world! 🩷
She has claimed the record for longest hair on a living person (female).
Her stunning raven tresses measure an unbelievable 271.50 cm (8 ft 10 in) long. pic.twitter.com/N8FeWdUGP0
— Guinness World Records (@GWR) August 7, 2026
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?