Amruta Fadnavis: రాజకీయ నాయకు లు ఇలాగే ఉండాలి అని ఒక రూల్ ఉంది. కానీ వారి భార్యాపిల్లలు ఎలా ఉండాలి అనేది అది వారి ఇష్టం. సీఎం అయినా.. డిప్యూటీ సీఎం అయినా.. వారి కుటుంబాలు వారికి నచ్చినట్టు ఎంజాయ్ చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది. నువ్వు సీఎం భార్యవు.. కాటన్ చీర కట్టుకొని.. నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని ఉండాలి అనడం తప్పు అవుతుంది. అందుకే తాను మొదట నుంచి ఇండిపెండెంట్ విమెన్ గానే ఉంటాను అంటుంది అమృత ఫడ్నవీస్.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత ఫేమసో.. ఆయన భార్య అమృత ఫడ్నవీస్ అంతకన్నా ఫేమస్ అని చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. బ్యాంకర్, సింగర్, నటి.. సోషల్ వర్కర్..ఒకటని చెప్పలేం. ఎలక్షన్స్ వచ్చాయి అంటే.. భర్త వైపు ప్రచారం చేయడానికి ప్రచారకర్తగా మారిపోతుంది.
Sumalatha: సుమలత కొడుకు పెళ్లి.. మోహన్ బాబుదే సందడంతా
సమయం చిక్కినప్పుడల్లా .. ఇదుగో ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో అలరిస్తుంది. తాజాగా అమృత కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ కలర్ వెస్ట్రెన్ డ్రెస్ లో అదరగొట్టింది. ఈరోజు పర్యావణ దినోత్సవం కావడంతో అడవిలో పచ్చని చెట్ల మధ్య ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా పర్యావణాన్ని పెంచమని కోరింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సూపర్ అంటుంటే.. ఇంకొంతమంది విమర్శిస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోకుండా అమృత.. తన జీవితాన్ని తనకు నచ్చినట్టు జీవిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.