MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. దాదాపు ఐదు గంటల పాటు అవినాష్‌ని విచారించింది సీబీఐ.. అయితే, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి హాట్ కామెంట్లు చేశారు.. వాస్తవాలు టార్గెట్‌గా కాకుండా.. వ్యక్తి టార్గెట్ గా విచారణ సాగుతోందని ఆరోపించారు.. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులోని వాస్తవాలపై నేను సీబీఐ అధికారులకు ఒక రిప్రజంటేషన్ ఇచ్చాను అని వెల్లడించారు.. నాకున్న అనుమానాలు ప్రస్తావించాను.. గూగుల్ టేక్‌ఔట్ అంటూ గతంలో టీడీపీ ప్రస్తావించింది.. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలు వస్తున్నాయంటే.. ఇది గూగుల్ టేక్‌ఔటో..? టీడీపీ టేక్‌ఔటో బయటపడుతుందన్నారు..
Read Also: CM YS Jagan: విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. కరెంట్ కోతలు, వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం
టీడీపీ చెప్పిన అంశాలను సీబీఐ కౌంటర్ లో ప్రస్తావిస్తుందని విమర్శించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. పారదర్శకంగా విచారణ సాగాలని కోరుతున్నాను.. వైఎస్ వివేకా ఇంట్లో దొరికిన లెటర్ బయటపెట్టాలని కోరారు.. వివేకా చనిపోయిన రోజు మాట్లాడిన మాటలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చెయ్యాలని కోరాను.. కానీ, అది జరుగలేదన్నారు.. ఇక, నాకు 160 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి విచారిస్తున్నారని తెలిపిన అవినాష్‌రెడ్డి.. కానీ, నన్ను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారో అర్థం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ, ఒక అబద్దాన్ని 0 నుంచి 100కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.. ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఈ విషయంపై సంయమనం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.