ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు పరామర్శించారు. Also Read:…
Perni Nani: తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణలో వెసులుబాటు అడగడం తప్పా? అని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఆక్టోపస్ అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు అప్పట్లో మోడీతో తగాదా పెట్టుకున్నాడు.. 2014-2019 మధ్య ప్రభుత్వం జీవో 176 తెచ్చింది.. సీబీఐకి చంద్రబాబు ప్రభుత్వ జనరల్ కంసెంట్ ను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందని గుర్తుచేశారు.. కానీ,…
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వెకేషన్ బెంచ్ జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, పిటిషన్ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు…
శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు.. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని.. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.. ఆమె మా వైద్యుల బృందం పర్యవేక్షణలో సీసీయూలో ఉన్నారు. రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉన్నారని వెల్లడించారు..
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉన్నారు.. అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్ష్యం చెప్పడానికి పిలిచిన ప్రతిసారి వెళ్లారు.