MLA Prasanna Kumar Fires On Pawan Kalyan: ఏపీలో వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని కొందరు వైసీపీ నేతలు హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యలాపాలకు పాల్పడుతున్నారంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ తాజాగా స్పందించారు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ వ్యంగంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఏపీలో 29 వేల మందికి పైగా మహిళలు కనిపించకుండా పోయారని కేంద్ర నిఘా సంస్థ చెప్పిందని పవన్ చెప్తున్నాడని.. అసలు పవన్‌కి, కేంద్ర నిఘా సంస్థకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిస్సైన ఆడవాళ్ల వెనుక వాలంటీర్లు ఉన్నారని చెప్పడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. రాష్ట్రంలో వైసీపీకి బలం పెరుగుతండటం చూసి తట్టుకోలేకే.. పవన్ వాలంటీర్ల మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు
Mithun Reddy: పవన్‌కి మిథున్ రెడ్డి సవాల్.. ఆ ప్రకటన చేసే దమ్ముందా?
ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో, ఎంతమంది బిడ్డలను కన్నావో.. ఒకసారి చరిత్రని పవన్ కళ్యాణ్ చూసుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు. వాలంటీర్ వ్యవస్థపై దారుణమైన ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకసారి గ్రామాల్లోకి వచ్చి, వాలంటీర్లు పడుతున్న కష్టాల్ని చూడాలని చెప్పారు. మెగా కుటుంబంలో చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ పుట్టడం.. తమ దురదృష్టం, తమ ఖర్మ అని మండిపడ్డారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో నారాలోకేష్‌పై కూడా ప్రసన్నకుమార్ విరుచుకుపడ్డారు. బీసీలకు వైసీపీ వ్యతిరేకమని లోకేష్ చెప్పడం.. ఆయన అవివేకానికి నిదర్శనమని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీలకు రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్‌లు పెద్ద పీట వేశారని అన్నారు. కావలి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర విఫలమైందని వ్యాఖ్యానించారు.
Samantha Instagram Story: మరో మూడు రోజులు మాత్రమే.. సమంత ఇన్‌స్టా స్టోరీ వైరల్!