Samantha Instagram Story: మరో మూడు రోజులు మాత్రమే.. సమంత ఇన్‌స్టా స్టోరీ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా స్టోరీ చూస్తే అదే నిజం అని అనిపిస్తోంది.
తాజాగా సమంత తన ఇన్‌స్టా స్టోరీలో కారవాన్ ఫొటో పెట్టారు. ‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’ అని ఫొటోపై రాసుకొచ్చారు. అంతేకాదు తన ఫొటో ఒకటి పెట్టి.. ‘6 నెలలు కష్టంగా గడపడానికి సిద్ధపడాలి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. దాంతో సమంత సినిమాలకు కొన్ని నెలలు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని స్పష్టంగా అర్ధవవుతోంది. సమంత ఇన్‌స్టా స్టోరీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
‘ఖుషి’ షూటింగ్ అయ్యాక సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం తెలుస్తోంది. సామ్ పోస్ట్ చూసి అభిమానులు త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాల్లో నటించాలని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవకొండ సరసన సమంత ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. సమంత చేతిలో ఉన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం సామ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ఇక వచ్చే ఏడాదే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం.
Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం: అబ్దుల్ రజాక్
Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023 సెమీస్ చేరే జట్లు ఇవే.. ఐదవ టీమ్ పాకిస్థాన్!

Samantha Ista

Sam Insta
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!