Mithun Reddy: పవన్‌కి మిథున్ రెడ్డి సవాల్.. ఆ ప్రకటన చేసే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Challenges Pawan Kalyan Over Volunteer System: ఉభయగోదావరి జిల్లాల వైసీపీ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు గుప్పిస్తున్న పవన్.. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించగలరా? అని ఛాలెంజ్ చేశారు. ఇంతకీ ఉభయగోదావరి జిల్లాల్లో మీ అభ్యర్థులెవరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే పవన్ పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 34 సీట్లలో పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయని.. అసలు ఆ సీట్లలో ఎన్నింటిలో పోటీ చేస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తమతమ పార్టీల పరిపుష్టం కోసమే.. టీడీపీ, జనసేన ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Gudivada Amarnath: జగన్‌కి సవాల్ చేయడమంటే.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్లే
Also Read
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’లో బాగా పని చేసిన వారందరికీ టికెట్లు ఇస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉండదన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు గణనీయంగా తగ్గాయని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా ఏపీ అవతరించిందని చెప్పారు. టాప్-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎంపీలందరూ కేంద్రంపై పోరాడుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై కూడా పోరాడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ కలుస్తుందనే వార్తలు కేవలం ఊహాజనితం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలోకి వస్తే సంతోషిస్తామన్నారు. ముద్రగడను తానేమీ కలవలేదని, ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా ముందస్తు ఎన్నికలు ఉండవని, పార్లమెంట్‌తో పాటే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని మిథున్ రెడ్డి వెల్లడించారు.
Constable Fake Notes: దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్.. ఒకటికి మూడు చొప్పున నకిలీ నోట్లు ఇస్తానని..
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!