Akira Nandan Watches Bro Movie at Sudarshan Theatre: పవన్ కళ్యాణ్-ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే. జోరు వానల్లోనూ థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘బ్రో’ సినిమా థియేటర్ వద్ద సందడి చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కు అకీరా వెళ్లి తన తండ్రి సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. ఖరీదైన కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎవరో సెలబ్రిటీ అనుకున్నారు కానీ అది అకీరా ని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టి సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు.
Baby: ‘బేబీ’కి మెగా ప్రశంసలు.. కన్నీళ్లు ఆగడంలేదట!
అంతేకాదు జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలా కాలం నుంచి అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా అకీరా అరంగేట్రం కోసం చాలా వేచి చూస్తున్నారు. అకీరా పవన్- రేణు దేశాయ్ ల కుమారుడు. పవన్ విడాకులు తీసుకోగా ఇప్పుడు అకీరా తన తల్లి సంరక్షణలోనే పెరుగుతున్నారు. అయితే పవన్ తన పిల్లలను చూడాలి అనిపించినా పవన్ ను పిల్లలు చూడాలి అనిపించినా కలుస్తూ ఉంటారు. ఇక తన పిల్లలు ఏ రంగంలో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా అందుకు పూర్తిగా సహకరిస్తాను అని రేణు దేశాయ్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.