రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు గతంలోకంటే బాగా అమలు అవుతున్నాయని, విపక్షాల విమర్శల్ని అసలు పట్టించుకోవద్దన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నాయకులు ఎన్నైనా మాట్లాడుతారు. సమాధానం మనం చేసే పని కార్యక్రమాలు ఉండాలి. మూడు సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి… తండ్రి తనయులు జిల్లాకి చేసిన అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువే అని చెప్పగలం. ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతారు… పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స.
ప్లీనరీ అయిన తరువాత నియోజకవర్గం స్థాయిలో శ్వేత పత్రం విడుదల చేస్తాం. సంక్షేమ కోసం అయిదు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చాం. రాబోయే రెండేళ్లలో మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. ఈ డబ్బు ఇస్తోంది పేదవాడి స్థితి గతులు మారాలని. అవి ఊరకనే ఇవ్వడం లేదు. బాబొస్తే జాబొస్తాదని చెప్పారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తురువాత వ్యవస్థలను స్థాపించారు…. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అప్పడు పచ్చ చొక్కాలు వేసుకునే వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అర్హత ఉంటే చాలు వారికి లబ్ధి చేకూరుతుంది.ఎక్కడా దళారులు లేకుండా పథకాల అమలు విజయవంతంగా సాగుతోందన్నారు.
BJP: ఏపీ సీఎం జగన్‌కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి
హుద్ హుద్ తుఫాన్ వచ్చిన రెండు రోజుల వరకూ విశాఖలో నీళ్లు రాలేదు. బస్సులో పడుకుంటే ఏంటీ ఇంట్లో పడుకుంటే ఏంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, కరెంటు అందాలి… ఇది చేయలేకపోయారు. మైండ్ డైవర్సన్స్ వస్తున్నాయి.. జాగ్రత్త పడండి.. మారండి. జిల్లాకు రాజకీయంగా మంచి పేరుంది… ఇక్కడ నిర్ణయాలు రాష్ట్ర పార్టీలో మార్పులు చేసే వారు. మూడు నెలలకు జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహించాలి. తప్పు జరిగితే సమర్ధించ కూడదు… సమస్య వినాలి సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు మంత్రి బొత్స.
చంద్రబాబు మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. నేడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది… నిధులు కేటాయించారు… వచ్చే ఏడాదికి మెడికల్ స్టూడెంట్స్ వస్తారు… ఇది వాస్తవం. తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్టు అశోక్ వద్దంటారు. ఏంటో మరి? 16 వేల కోట్ల రూపాయలు స్కూల్ లో మౌలిక వసతుల కోసం ఖర్చుపెట్టాం. 35 లక్షల మందికి బైజూస్ ద్వారా ఫ్రీగా క్లాసులు చెప్పబోతున్నారు. జిల్లా మీదుగా వెయ్యి కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్నాయి. భూసేకరణకు చాలా ఇబ్బంది అవుతున్నా… మా ప్రతినిధులతో రైతుకు చెప్పగలుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు బాగా చేస్తారో వాళ్లనే ఎన్నుకుంటారు.. గౌరవం అందిస్తారు అన్నారు మంత్రి బొత్స.
BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..