Merugu Nagarjuna Counters On Chandrababu Naidu Manifesto: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఇప్పుడు శవ పేటికలా మారిందంటూ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పేదలకు సెంటు ఇళ్లు, ఇంగ్లీషు విద్య ఇస్తుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే.. ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలను.. తన వాళ్లకు రాబందుల్లాగా తినడానికి పెట్టారంటూ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోక కత్తిరిస్తాను అన్నాడని, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పాడని గుర్తు చేశారు. 2014లో 650 వాగ్దానాలు మేనిఫెస్టెలో పెట్టావ్, ఎన్ని అమలు చేశావో చెప్ప అంటూ చంద్రబాబుని నిలదీశారు. అందులో 10 శాతం వాగ్దానాలైన అమలు చేశావా? అని ప్రశ్నించారు. 2 లక్షల 80 కోట్ల రూపాయలను డీపీటీ రూపంలో పేదలకు పైసా లంచం లేకుండా అందజేశామని తెలియజేశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చిన నీచుడు చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ తీసేస్తారని పేర్కొన్నారు.
Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్
పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలందరిని ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని మంత్రి నాగార్జున విరుచుకుపడ్డారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్నన ‘అమ్మకు ఒడి’ పథకాన్ని.. అమ్మకు వందనం పేరుతో కాపీ కొట్టారని తూర్పారపట్టారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో గుర్తొచ్చిందా అని నిలదీశారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఏనాడూ తాను ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయలేదని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే.. ఏ పథకమూ గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు.
Meta Layoff: ఉద్యోగం కోసం ఇండియా నుంచి యూకేకి.. 2 నెలలకే జాబ్ నుంచి పీకి పారేశారు..