AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను…
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ హాట్‌గా నడుస్తోంది. పార్టీ మారతారన్నది ఒక ఎత్తయితే.... ఏకంగా వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టడం కలకలం రేపుతోంది. ఆ ప్రచారానికి ఉక్కిరి బిక్కిరయిన ఉమా... చివరికి స్పందించి ఖండించాల్సి వచ్చిందంటే... పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీకి అత్యంత లాయల్ అన్న పేరుంది దేవినేనికి. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి.
ఆ మాజీ మంత్రి తన ప్రాపకం కోసం సొంత పార్టీ టీడీపీని ఇరుకున పెడుతున్నారా? ఉనికి చాటుకునేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలతో కేడర్ కంగారు పడుతోందా? పార్టీకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆ సీనియర్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి కెలికేసి… తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? తెర వెనక రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏంటాయన మంత్రాగం?.. దేవినేని ఉమా… టీడీపీ సీనియర్ లీడర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన…
Devineni Uma: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ప్రజా సమస్యలను తీర్చేందుకు తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు.
జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అడ్డగోలుగా లిస్ట్ తయారు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో పేర్కొ్న్నారు.
టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. "లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు