Realme C73 5G: భారత మార్కెట్లో రియల్‌మీ సంస్థ తన తాజా C-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన రియల్‌మీ C73 5Gను విడుదల చేసింది. గత నెలలో విడుదలైన C75 తర్వాత ఇది అదే సిరీస్‌లో మరో కొత్త మొబైల్ గా లాంచ్ అయ్యింది. అధునాతన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరలో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా దీనిని తీసుక వచ్చింది కంపెనీ. మరీ ఈ మొబైల్ ఫీచర్స్ అండ్ ధరలను తెలుసుకుందామా..
Read Also: Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!
ఈ రియల్‌మీ C73 5G 6.67 అంగుళాల HD+ 120Hz IPS LCD డిస్‌ప్లేతో వస్తోంది. మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ 4GB RAMతో పాటు 8GB వరకు డైనమిక్ RAM పొడగింపు సపోర్ట్‌ను కలిగి ఉంది. 64GB, 128GB వేరియంట్లు మనకు లభిస్తాయి. వీటిని 2TB వరకు మెమరీ కార్డు ద్వారా విస్తరించుకునే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఫోన్ వెనుక భాగంలో 32MP ప్రాధమిక కెమెరా ఉండగా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. రియల్‌మీ UI 6.0 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది.
ఇక బ్యాటరీ, డిజైన్ చూస్తే.. ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. ఇది MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 డస్ట్, స్ప్లాష్ ప్రూఫ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బరువు 197 గ్రాములు కాగా, మందం 7.94 mm మాత్రమే ఉంది. అలాగే ఈ మొబైల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 4G VoLTE, 5G బ్యాండ్‌లకు సపోర్ట్, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also: Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే సినిమా రిలీజ్ కాదు: కర్ణాటక ఫిలిం ఛాంబర్..
ధర:
జాడే గ్రీన్, క్రిస్టల్ పర్పుల్, Onyx బ్లాక్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 4GB + 64GB వేరియంట్ ను రూ. 10,499గా, 4GB + 128GB వేరియంట్ ను రూ. 11,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ రియల్‌మీ, ఫ్లిప్ కార్ట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. ఇక లాఉంచి ఆఫర్ కింద ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIపైన సరే రూ. 500 తక్షణ రాయితీ అందించబడుతుంది. మొత్తంగా రియల్‌మీ C73 5G తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తున్నందున బడ్జెట్ మొబైల్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.