టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. నాగ శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఆ తరువాత ఈ యంగ్ హీరోకి ఆ రేంజ్ హిట్ లభించలేదు.గత కొంత కాలం నుంచి వరుస పరాజయలతో ఇబ్బంది పడుతున్నాడు. నాగ శౌర్య గత ఏడాది రంగబలి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి పవన్ బాసం శెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం చేసిన ప్రమోషన్ లు ..అలాగే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని బాగుండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలా మంచి అంచనాలతో ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే ఆకట్టుకుంది. ఇక చివరిగా ఈ సినిమాబాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ మూవీ గా నిలిచిపోయింది.ఇకపోతే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నాగ శౌర్యకు కచ్చితంగా ఒక సూపర్ హిట్ ఇవ్వాలి అని పవన్ బాసం శెట్టి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ దర్శకుడు నాగ శౌర్య కోసం ఓ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం..ఆ కథ ఈ దర్శకుడు అనుకున్నట్లు రాగానే దానిని నాగ శౌర్య కు వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ బాసం సెట్టి కి మరో అవకాశం ఇవ్వాలి అని నాగ శౌర్య కూడా అనుకుంటున్నట్లు సమాచారం.. ఆయన చెప్పిన కథ కనుక నచ్చినట్లయితే వెంటనే ఆ దర్శకుడి సినిమాకు ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.