Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన సగం కాలిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. తోటి స్నేహితుడే, ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అసలు హత్య ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 3న దారుణ హత్య జరిగింది. క్రీడా మైదానం వద్ద సరిగా పాతికేళ్లు కూడా నిండని యువకుడి మృతదేహం…
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. నెల్లూరులో తనకు ఇంటర్ సీటును దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి.. ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాలో తిరిగానని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు అని పవన్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది. Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!…
తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల…
Road Accidents: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ ముందుకొచ్చింది. ఆర్వెన్సిస్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఈరోజు తాడేపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ను కలిశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంట్ నిర్మాణానికి ఒకే చెప్పారు. తొలుత రూ.150 కోట్లతో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 12-20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. Also Read: PM Modi…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మార్కాపురానికి సీఎం వెళ్లనున్నారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం…
Mother Killed Son: ప్రకాశం జిల్లాలోని కంభం తెలుగు వీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవీ ( అలియాస్ సాలమ్మ) హత్య చేయించిందని నిర్థారించారు.