ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.
జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ. వరద ప్రవాహంతో 8 అడుగులు గోడ కూలింది. లక్ష్మినారాయణ స్వామి,వేణుగోపాల స్వామి ఆలయంలోకి చేరుతున్న నీరు. తిరుమలలో భారీ వర్షంతో కంప్యూటర్ కార్యలయంలోకి నీరు చేరింది. సర్వర్లు షట్ డౌన్ చేసిన టీటీడీ. నీరు ఇతర ప్రాంతాలకు చేరకుండా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టింది. సర్వర్ రూంలోకి నీరు చేరడంతో వివిధ రకాల సేవలు నిలిచిపోయాయి. తిరుపతిలో జలప్రళయం కలిగిస్తోంది. తిరుపతి జనం వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వేకువజాము నుంచి దంచికొడుతోంది వర్షం. అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. మధురానగర్ లో ఐదు అడుగులు మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ముందస్తు అప్రమత్తతను ప్రకటనలకే పరిమితం చేశారు అధికారులు. ఇవాళ విద్యాసంస్థలకు శెలవులు ప్రకటించలేదు వివిధ విద్యాసంస్థలు. ప్రధాన రోడ్లలలో మూడు అడుగులు మేర ప్రవహిస్తూన్న వరద నీటితో ఎక్కడిక్కడ నిలిచిపోయింది ట్రాఫిక్. విద్యాసంస్థల నుంచి విద్యార్దులు ఇంటికి రాలేదని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితి నేపథ్యంలో కలెక్టర్ హరినారాయణ శుక్రవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తిరుపతి ప్రజలు ఎవరూ బయటకు రావద్దు. భారీవర్షాలు కురుస్తూండడంతో పరిస్థితి ప్రమాదకరంగా వుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావద్దన్నారు అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు.